14 August, 2026 | 8:18 PM

Breaking News

వివాహ ఆహ్వాన పత్రిక అందజేత   •   స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులను కార్యక్రమానికి తరలించాలి   •   60 ఏళ్లుగా జీవనాధారంగా ఉన్న మడిగపై వివాదం   •   పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో   •   నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు   •   హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం   •   ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఖర్గేకు సంఘీభావంగా ఆలేరులో కాంగ్రెస్ భారీ పాదయాత్ర, సత్యాగ్రహం   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •  

ఈవీ చార్జింగ్ మౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక

18-04-2026 12:53 AM

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు

హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అధిక సంఖ్యలో ఈవీ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం సమగ్ర ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. 

ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ మౌలిక వసతుల అమలుపై సచివాలయంలో శుక్రవారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో రవాణ, రోడ్లు, భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, ప్రణాళిక కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రవాణశాఖ కమిషనర్ ఇలంబర్తి, టీజీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ శశాంక, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, టీజీరెడ్‌కో ఎండీ అనిలా వవిల్లా, ఓఈఎం ప్రతినిధులు పాల్గొన్నారు.