28 April, 2026 | 3:03 AM

1 నుంచి మున్సిపాలిటీలో ప్లాస్టిక్ నిషేధం

28-04-2026 01:19 AM
  1. పట్టణాన్ని క్లీన్ సిటీగా ఉంచాలి
  2. మున్సిపల్ ఛైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ 

ఆదిలాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి) :  ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో మే 1 తేదీ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం నిషే ధం అమల్లోకి రానుందని మున్సిపల్ ఛైర్‌ప ర్సన్ బండారి అనూష సతీష్ వెల్లడించారు. పట్టణాన్ని పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు మున్సిపాలిటీ నడుం బిగించిందన్నారు. కార్యాలయంలోని తన చాంబర్‌లో అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.   ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ బం డారి అనుష మాట్లాడుతూ.

 ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలో సింగిల్ యూజ్ (ఒక్కసారి వాడి పారేసే) ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపారు.120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు స్ట్రాలు, ప్లాస్టిక్ జెండాలకు ప్రజలు దూరంగా ఉండాలని వాటిని పూర్తిగా నిషేధిస్తున్నామని వెల్లడించారు. ప్లాస్టిక్ వల్ల డ్రైనేజీలు పూడిపోవడమే కాకుండా భూగర్భ జలాలు కలుషిత మవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారులు, ప్రజలు స్వచ్ఛందంగా సహకరిం చి ప్లాస్టిక్ రహిత ఆదిలాబాద్‌ను రూపొందించాలని కోరారు.

పట్టణంలోని కిరాణా దుకా ణాలు, హోటళ్లు, కూరగాయల మార్కెట్లలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ప్లాస్టిక్ విక్రయించినా భారీ మొత్తంలో జరిమానాలు విధిస్త మని స్పష్టం చేశారు. షాపింగ్‌కు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా బట్ట సంచులు వెంట తీసుకెళ్లాలని, శుభకార్యాల్లో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లకు బదులు స్టీల్ లేదా విస్తరాకులు వాడాలని, పరిసరాల పరిశుభ్రత కోసం తడి, పొడి చెత్తను వేరువేరుగా మున్సిపల్ వాహనాలకు అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పట్టణాన్ని క్లీన్ సిటీగా ముందంజలో ఉంచేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా మెలగాలని మున్సిపల్ యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. అదేవిధం గా మున్సిపాలిటీలో విద్యుత్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత పది రోజులుగా మున్సిపల్ వార్డ్ ఆఫీసర్లు,  మున్సిపల్ ఎలక్ట్రిసిటీ అధికారులు పట్టణంలోని 49 వార్డులలో అవసరమైన రిక్వైర్మిం ట్లను ఎలక్ట్రిసిటీ విద్యుత్ అధికారులకు ఇవ్వ డం జరిగిందన్నారం పట్టణంలోని పలు వార్డు ల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. వీధి దీపాల నిర్వహణలో భాగంగా పట్టణంలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత వీధుల్లో స్ట్రీట్ లైట్ థర్డ్ వైర్లను వెంటనే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. 

విలీన గ్రామపంచాయతీ పరిధిలలో థర్డ్ వైరు నిర్వహణ కొరకు మున్సిపాలిటీ నుండి డబ్బులు చెల్లించడానికి సిద్ధం గా ఉన్నామని తెలపడం జరిగింది. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏఈ) వినోద్, సదానందం,  మున్సిపల్ డిఈ కార్తీక్, ఏఈ నితిన్, కిరణ్,మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్, మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.