యశోదలో ప్లాస్టిక్ సర్జరీ ప్రారంభం

28-08-2026 | 12:16am

ముకరంపుర, ఆగస్టు 27(విజయక్రాంతి): యశోద హాస్పిటల్(Yashoda Hospita) సోమాజిగూడ(Somajiguda) డాక్టర్ శశికాంత్(Shashikanth) మద్దు గురువారం కరీంనగర్‌(Karimnagar)లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ సోమాజిగూడ శాఖలో సెంట ర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ప్లాస్టిక్ సర్జరీని ప్రారంభించామని తెలియజేశారు. ప్లాస్టిక్ సర్జరీ(Plastic surgery) అ నేది కేవలం రూపాన్ని మార్చడం మాత్ర మే కాదు ఇది అవయవాల పనితీరును ఆత్మవిశ్వాసాన్నిచ, జీవన ప్రమాణాలను పునరుద్ధ రించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు.

రైనొ ప్లాస్టీ, లైపో సక్షన్ వంటి విధానాల లో సహజమైన, సురక్షితమైన ఫలితాలను అందించడంతోపాటు, పుట్టుకతో వచ్చే వైకల్యాలు, కాలిన గాయాలు మరియు ఇతర గాయాలతో బాధపడుతున్న పిల్లలకు దీర్ఘకాలిక పునర్నిర్మాణ సంరక్షణను అందించడమే ఈ సెంటర్ ఉద్దేశ్యం అని అన్నారు. ముఖ సౌందర్యాన్ని పెంపొందించడంతో పాటు శ్వాస సంబంధిత సమస్యలను సరిచేసి ఖచ్చితమైన, సహజమైన ఫలితాలు సా ధించ డానికి అధునాతన 3డి ఇమేజింగ్ ఫో టోగ్రఫీ సిమ్యులేషన్ మరియు సర్జికల్ ప్లా నిం గ్ వంటివి ఇందులో ఉపయోగిస్తారన్నారు.

మరిన్ని వార్తలు