కిడ్నీలో రాయితో బాధపడుతున్న గర్భిణి

28-08-2026 | 12:19am
  1. ‘ఏఐఎన్‌యూ’లో విజయవంతంగా శస్త్ర చికిత్స    
  2. ప్రసవం తర్వాత రాయి తొలగించిన వైద్యులు

హైదరాబాద్, ఆగస్టు 27(విజయక్రాంతి): హైటెక్ సిటీలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ(Asian Institute of Nephrology and Urology) (ఏఐఎన్‌యూ)ఆసుపత్రి వైద్యులు గర్భిణికి సురక్షిత మైన కాన్పు చేసి ఆమె కిడ్నీ(Kidney)లోని 4 సెంటీమీటర్ల రాళ్ల(Stones)ను విజయవంతంగా తొలగించా రు. ‘ముందు బిడ్డ, తర్వాత రాళ్లు’ అనే వ్యూ హాన్ని అనుసరించి  ఆమె ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తూ, కా న్పు పూర్తయ్యే వరకు ప్రధాన చికిత్సను వాయిదా వేసి, ప్రసవానంతరం రాయిని తీసేశారు.

ఆ మహిళకు గర్భధారణ సమయంలో ఎటువంటి ముఖ్యమైన లక్షణాలు లేవు.  మొదటి త్రైమాసి కంలో చేసిన మూత్ర పరీక్షలలో పదేపదే చీము కణాలు, ప్రోటీనూరియాచ సూక్ష్మ రక్తపు ఆనవాళ్లు కనిపించాయి, అదే సమయంలో మూత్ర కల్చర్లలో ఈ. కోలి కూడా కనుగొనబడింది. ఏడవ నెలలో చేసిన అల్ట్రాసౌండ్‌లో, ఎడమ మూత్రపిండంలో సగాని కి పైగా ఆక్రమించి, సుమారుగా 35 స 18 మిమీ కొలతలతో కొ మ్ము ఆకారంలో ఉన్న మూత్రపిండపు రా యి ఉన్నట్లు వెల్లడైంది.

ఈ కేసులోని సంక్లిష్టత గురించి ఐనూ హాస్పిటల్ హైటెక్ సిటీ సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ దీపక్ రాగూరి మాట్లాడుతూ ‘గర్భధారణ స మయంలో పెద్ద కిడ్నీ స్టోన్ ఉండటం అనేది ఒక సంక్లిష్టమైన క్లినికల్ నిర్ణయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. 

ఆమె పరిస్థితి, గర్భధారణ దశను పరిగణనలోకి తీసుకుని, ఏఐఎన్‌యూ బృందం వెం టనే ఖచ్చితమైన స్టోన్ స ర్జరీ చేపట్టకుండా,  సంప్రదాయబద్ధమైన చికిత్సను ఎంచుకుం ది’ ఆ మహిళ సిజేరియన్ ద్వారా ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చారు. ఆరు వారాల తర్వాత  మహిళకు పీసీఎన్‌ఎల్ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహిం చారు.  ఆపరేషన్‌లో డాక్లర్లు చలపతి రాజు,  విశ్వజిత్ రెడ్డి,  నీలం  ఎల్ ఉదయ్‌కు మార్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు