13-11-2025 12:00:00 AM
వోక్సెన్ యూనివర్సిటీతో టీబీఏ ఒప్పందం
హైదరాబాద్, నవంబర్ 12(విజయక్రాంతి) : తెలంగాణలో బాస్కెట్‌బాల్ క్రీడను అత్యుత్తమ స్థాయిలో ప్రోత్సహించేందుకు కీలక అడుగు పడింది. కళాశాల స్థాయిలో టాలెంట్‌ను వెలికితీసేందుకు తెలంగాణ కాలేజ్ బాస్కెట్‌బాల్ లీగ్ నిర్వహించబోతున్నారు. దీనిలో భాగంగా వోక్సెన్ యూనివ ర్సిటీకి చెందిన వోక్సెన్ స్పోర్ట్ అకాడమీ, తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్(టీబీఏ) మధ్య ఒప్పందం జరిగింది. వోక్సెన్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ రోడ్రి గ్జ్, స్పో ర్ట్స్ హెడ్ విశాల్, తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్. శ్రీధర్‌రెడ్డి, సెక్రటరీ పృథ్వీశ్వర్‌రెడ్డి ఎంవోయూపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం తో తెలంగాణ లో బాస్కెట్‌బాల్‌కు మరింత ప్రోత్సాహం దక్కుతుందని టీబీఏ ప్రెసిడెంట్ శ్రీధర్‌రెడ్డి చెప్పారు. అత్యుత్తమ మౌలిక సదుపాయా లు ఉన్న వోక్సెన్ యూనివర్సిటీతో కలిలి తెలంగాణ కాలేజ్ బాస్కెట్‌బాల్ లీగ్ నిర్వహిస్తుండడం సంతోషంగా ఉందన్నారు. తెలం గాణలో నైపుణ్యం ఉన్న బాస్కెట్‌బాల్ ప్లేయర్స్‌ను గుర్తించడమే లక్ష్యంగా ఈ లీగ్ నిర్వ హిస్తున్నట్టు, దీని కోసం టీబీఏతో ఒప్పందం చేసుకున్నామని వోక్సెన్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ రోడ్రిగ్జ్ చెప్పారు. టీసీబీఎల్ తొలి సీజన్‌లో 20 జట్లు పా ల్గొనే అవకాశముందని, తర్వాత 32 జట్లకు విస్తరిస్తామని టీబీఏ సెక్రటరీ పృథ్వీశ్వర్‌రెడ్డి చెప్పారు.