13 July, 2026 | 9:42 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

టీమిండియాకు ఆడటమే లక్ష్యం: ఆరోన్ జార్జ్

09-02-2026 02:24 AM

అండర్ 19 ఛాంపియన్‌కు ఘనస్వాగతం

హైదరాబాద్, ఫిబ్రవరి 8 : అండర్ 19 ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించిన హైదరాబాద్ యువ క్రికెటర్ ఆరోన్ జార్జ్ నగరానికి తిరిగొచ్చా డు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అతనికి ఘనస్వాగతం లభించింది. కుటుంబసభ్యు లు, సన్నిహితులు, పలువురు నేతలు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండా రి లక్ష్మారెడ్డి ఆరోన్ జార్జ్‌ను కలిసి ప్రత్యేకంగా అభినందలు తెలిపారు.

రానున్న రో జుల్లో మరిన్ని విజయాల్లో కీలకంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆరోన్ జార్జ్ ప్రదర్శన యువతకు స్ఫూర్తినిస్తుందన్నారు.కాగా తన ను సపోర్ట్ చేసిన వారికి ఈ ప్రపంచకప్ విజ యం అంకితమని క్రికెటర్ ఆరోన్ జార్జ్ చెప్పాడు. జింబాబ్వే వికెట్ కాస్త భిన్నంగా ఉన్నప్పటకీ, తాను రెండు సెంచరీలు చేయ డం సంతోషంగా ఉందన్నాడు. డ్రెస్సింగ్ రూ మ్‌లోనూ, గ్రౌండ్‌లోనూ తమ ప్రణాళికలు చక్కగా అమలు చేసి ట్రోఫీ గెలిచామని చెప్పుకొచ్చాడు. రానున్న రోజుల్లో సీనియర్ జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే తన లక్ష్యమన్నాడు. తన తల్లిదండ్రులు, కోచ్ కారణం గానే తాను ఈ స్థాయికి వచ్చానని చెప్పాడు.