calender_icon.png 3 February, 2026 | 10:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా చెరువులోకి నీళ్లను విడుదల చేయండి సారూ..

03-02-2026 12:00:00 AM

రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి  2 (విజయ క్రాంతి):మా చేరు లోకి నీటిని విడుదల చెయ్యండి సార్.. అని ఇరు గ్రామాల అన్నదాతలు అధికారులను వేడుకుంటున్నారు.తంగళ్లపెల్లి మండలంలో ని మల్లాపూర్, దేశాయి పల్లి, అంకిరెడ్డిపల్లి, గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. నక్క వాగు ప్రాజెక్టు తూము ద్వారా నీటిని విడుదల చేయాలని అధికారులను గ్రామస్తులు కోరుతున్నరు.

తద్వారా మల్లాపూర్,దేశ యి పల్లె,అంకిరెడ్డి పల్లె, దరిదాపు లో చెరువులను నింపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దాదాపు 1000 ఎకరాలకు పంట పొలాలకు నీరు అంది పంటలు పండుతాయని ఇట్టి విషయం పై ఇరిగేషన్ అధికారులు స్పందించి తూము ద్వారా నీటిని విడుదల చేయాలని అదేవిధంగా ఇరు గ్రామస్తులు రైతుల సమస్యలను పట్టించుకోవాలని కోరుతున్నారు.

రంగనాయక్ సాగర్ నుండి పర్మిషన్ రాలేదు:ఇరిగేషన్ ఏఈ సాగర్

తంగళ్లపెల్లి లోని మల్లాపూర్, అంకిరెడ్డిపల్లి, దేశాయి పల్లి,గ్రామాల సమస్య కు రంగనాయక్ సాగర్ నుండి పర్మిషన్ రాగానే చెరువులోకి నీటి ని విడుదల ఇరు గ్రామాల కు నిరు విడుదల అయ్యేలా సహకరిస్తామని అన్నారు.