13-08-2025 01:01:15 PM
చిట్యాల,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రంలోని(Chityal Mandal) ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం చిట్యాల పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులతో మాదకద్రవ్యాల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. ముఖ్యఅతిథిగా చిట్యాల పోలీస్ కానిస్టేబుల్స్ జానీ, క్రాంతి కుమార్ పాల్గొని విద్యార్థులకు మరకద్రవ్యాల వినియోగం ఆరోగ్యానికి హానికరమని అదే విధంగా బైక్ డ్రైవ్ చేయరాదని ఎవరైనా మాదకద్రవ్యాలు తీసుకున్నట్లయితే సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రిన్సిపల్ కర్నాజి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎం.యుగేందర్,లెక్చరర్లు తిరుమల రావు ,శ్రీనివాస్ ,రమేష్ ,ఉమాదేవి ,బాలకృష్ణ పాల్గొన్నారు.