13-08-2025 12:59:21 PM
తాండూర్,(విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని(Tandur mandal) నర్సాపూర్ గ్రామ సమీప వాగు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు దాటికి వరద ప్రవాహం తీవ్రంగా మారింది. దొడ్డిగూడెంకు చెందిన యమున అనే తొమ్మిది నెలల గర్భవతికి బుధవారం ఆకస్మాత్తుగా పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా నర్సాపూర్ వాగు(Narsapur Vagu) ఉధృతికి వాగు దాట లేక పోయారు. ఈ విషయం తెలుసుకున్న తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్, పోలీసు సిబ్బంది కలిసి తాడు సాయంతో వాగు అవతలి వైపు వెళ్లి గర్భిణీని సురక్షితంగా యువతని ఇవతలి వైపు దాటించారు. మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. సమస్యలో ఉన్నామని తెలిసిన వెంటనే పోలీసులు వచ్చి తమకు సాయం చేయడం చాలా సంతోషంగా ఉందని గర్భిణీ కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.