calender_icon.png 1 October, 2025 | 2:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ అభివృద్ధిలో ఆర్ఎస్ఎస్‌ది కీలక పాత్ర

01-10-2025 12:28:57 PM

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది వేడుకలు(RSS Centenary Celebrations) ఘనంగా నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ధి వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... ఇవాళ మహర్నవమి శుభదినం.. ప్రజలందరికీ శుభాకాంక్షలు.. రేపు విజయదశమి.. అందరూ ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ఆర్ఎస్ఎస్ రక్షిస్తోందన్నారు. దేశఅభివృద్ధిలో ఆర్ఎస్ఎస్ ది కీలక పాత్ర ఉందన్నారు. సంఘ్ దేశాభివృద్ధి కోసమే పనిచేస్తోందని చెప్పిన నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఆర్ఎస్ఎస్ పై తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ పై ఎన్నో అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. భారతమాత సేవలో సంఘ్ కార్యకర్తలు లీనమయ్యారని పేర్కొన్నారు. అసత్యంపై సత్యం.. అన్యాయంపై న్యాయం.. అధర్మంపై ధర్మం గెలుస్తోందన్నారు. శతాబ్ధి వేడకలు చేసుకుంటున్న ఆర్ఆర్ఎస్ కు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. పేదల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు ఆర్ఆర్ఎస్ కృషి చేస్తోందని చెప్పారు. రూ. వంద నాణెం, పోస్టల్ స్టాంప్ ను నరేంద్ర మోదీ విడుదల చేశారు.

దేశానికి సేవ చేసేందుకు సంఘ్ కార్యకర్తలు ఎప్పుడూ ముందుటారని ప్రధాని కొనియాడారు. నది తన ప్రవాహంలో అనేక భూముల్లో పచ్చదనం పెంచుతుంది.. నదీ ప్రవాహంలా ఆర్ఆర్ఎస్ కూడా ప్రజలకు సేవ చేస్తోందని చెప్పారు. విద్య, వైద్యం, రైతులకు అనేక విధాలుగా సంఘ్ సేవలు అందిస్తోందని కొనియాడారు.  ఆర్ఎస్ఎస్ చేసే ప్రతి పనిలో ఒకటే కనిపిస్తోందన్న ప్రధాని.. అదే నేషన్ ఫస్ట్ అన్నారు. పర్యావరణ పరిరక్షణ.. ప్రతి ఒక్కరి నినాదం కావాలి.. స్వదేశీ నినాదంతో ముందుకెళ్తేనే ఆత్మనిర్భర్ భారత్ సాధ్యమన్నారు. వోకల్ ఫర్ లోకల్ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. సామాజిక న్యాయం కల్పన దిశగా కార్యక్రమాలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వ అనేదే మన బలం అన్నారు. భారత సంస్కృతికి మూలం మన కుటంబ విలువలేనని, కుటుంబలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలు సమర్థంగా నిర్వహించాలని ప్రధాని కోరారు. ప్రతి ఇంట్లో పెద్దలను గౌరవించాలి.. పిల్లలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తన బాధ్యత చిత్తశుద్ధితో నిర్వహిస్తేనే వికసిత్ భారత్ సాధ్యమన్నారు