calender_icon.png 15 August, 2025 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రెడాయ్ ప్రాపర్టీ షోను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

15-08-2025 02:38:07 PM

నేను మధ్యతరగతి మనస్తత్వం ఉన్న వ్యక్తి

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో హైటెక్స్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షోను(CREDAI Property Show ) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ ప్రాపర్టీ షో కొనసాగనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు ప్రాపర్టీ షోలో స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ... ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలని సూచించారు. పాలనలో పారదర్శకత ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతోందని తెలిపారు. శతాబ్ధాలుగా సాగిన హైదరాబాద్ అభివృద్ధిలో ఎంతోమంది పాత్ర ఉందని పేర్కొన్నారు.

పాలకులు మారినా పాలసీ పెరాలసిస్ లేకపోవడంతో అభివృద్ధి కొనసాగిందని చెప్పారు. దేశవిదేశాలు తిరుగుతూ పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నామని సూచించారు. స్వదేశీ పెట్టుబడుల విషయంలో కొందరు అపోహలు సృష్టిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నేను మధ్యతరగతి మనస్తత్వం ఉన్న వ్యక్తిగా ఆలోచిస్తానని సీఎం స్పష్టం చేశారు. ప్రజల సంపద కొల్లగొట్టి విదేశాలకు తరలించి దాచుకునే ఆలోచన నాకు లేదని తేల్చిచెప్పారు. గత ప్రభుత్వం అధిక వడ్డీ రేట్లకు భారీగా రుణాలు తెచ్చిందని సీఎం మండిపడ్డారు. మేం పాత రుణాలను తక్కువ వడ్డీ రేట్లకు రీషెడ్యూల్ చేయించామని సూచించారు. మెట్రో రైలు విస్తరణ కోసం ఎంతో ప్రయత్నాలు  చేస్తున్నామని తెలిపారు. సమాజానికి చేసిన మంచిని ఎవరూ తీసుకెళ్లలేరని చెప్పారు. ఫ్యూచర్ సిటీని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి సూచించారు.