calender_icon.png 22 May, 2025 | 5:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశవ్యాప్తంగా 103 అమృత్‌ భారత్‌ రైల్వేస్టేషన్లు ప్రారంభం

22-05-2025 11:34:45 AM

న్యూఢిల్లీ: అమృత్ భారత్ స్టేషన్ పథకం(Amrit Bharat Station Scheme) కింద గురువారం నాడు 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 86 జిల్లాల్లో పునరాభివృద్ధి చేయబడిన 103 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజస్థాన్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. రాజస్థాన్ లో జెండా ఊపి అమృత్ భారత్ స్టేషన్లను మోదీ ప్రారంభించారు. ప్రారంభోత్సవం తర్వాత పాఠశాల విద్యార్థులతో ప్రధాని ముచ్చటించారు. తెలంగాణ రాష్ట్రం(Telangana State)లో బేగంపేట, కరీంనగర్, వరంగల్, ఏపీలో సూళ్లూరుపేట అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ప్రాంతీయ నిర్మాణాన్ని ప్రతిబింబించేలా, ప్రయాణీకుల సౌకర్యాలను పెంపొందించడానికి రూపొందించబడిన 1,300 కి పైగా స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో పునరాభివృద్ధి చేస్తున్నారు. ఈ 103 స్టేషన్ల పునరుద్ధరణకు దాదాపు రూ. 1,100 కోట్లు ఖర్చవుతుంది. ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మరిన్ని రాష్ట్రాల స్టేషన్లు ఇందులో ఉన్నాయి.