రోడ్డుపై ల్యాండ్ అయిన ప్రధాని విమానం
మోరన్: ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) అస్సాంలో పర్యటిస్తున్నారు. యుద్ధ విమానాల నుండి రవాణా హెలికాప్టర్ల వరకు, అత్యవసర పరిస్థితులు, ప్రతిస్పందనల కోసం నిమగ్నమైన భారత వైమానిక దళ విమానాలు అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలోని అత్యవసర ల్యాండింగ్ సౌకర్యం (ELF) వద్ద వైమానిక ప్రదర్శనను ప్రదర్శించాయి. దీనిని శనివారం ప్రధానమంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఐఏఎఫ్ కి చెందిన సుఖోయ్-30, రాఫెల్, హెలికాప్టర్లు ఈఎల్ఎఫ్ నుండి ల్యాండ్ అయ్యాయి. టేకాఫ్ అవుతాయి, ఫ్లై-పాస్ట్‌లో పాల్గొంటాయని అధికారులు తెలిపారు. మోడీ ఈశాన్య ప్రాంతంలో మొట్టమొదటిసారిగా మోరాన్ బైపాస్‌లోని 4.2 కి.మీ ఈఎల్ఎఫ్ వద్ద చాబువా స్థావరం నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో ల్యాండ్ అయ్యారు. ప్రధాని విమానం రోడ్డుపైనే ల్యాండ్ అయింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై మోడీ విమానం ల్యాండింగ్ అయింది. ఈశాన్య భారతంలో ఇదే తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ అని అధికారులు వెల్లడించారు.




