28 July, 2026 | 1:06 AM

ఎన్టీఆర్ ఆశయాల సాధనకు కృషి చేస్తాం : ప్రధాని మోడీ

28-05-2024 01:07 PM

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు 101వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. తెలుగు సినిమాలకు ఎన్టీఆర్ గొప్ప స్ఫూర్తి అన్నారు. దూరదృష్టి కలిగిన రాజకీయ నాయకుడు.. ఎన్టీఆర్ అన్న ఆయన సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ సేవలు మరువలేనివి కొనియాడారు. వెండితెరపై ఎన్నో మరుపురాని పాత్రల్లో నటించి మెప్పించారని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలకు సాధనకు కృషి చేస్తామని మోడీ పేర్కొన్నారు. ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ కుమారుడు, టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ, కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి, మనవడు, ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ హుస్సేన్ సాగర్ సరస్సు ఒడ్డున ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు..