12 July, 2026 | 3:09 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

మన్‌కీ బాత్‌లో ఏఎన్ఆర్‌ను కొనియాడిన మోదీ

29-12-2024 05:01 PM

అక్కినేని తెలుగు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారు.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) 'మన్ కీ బాత్' 117వ ఎపిసోడ్‌లో తెలుగు దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao)కి నివాళులర్పించారు. ఏఎన్ఆర్ తెలుగు సినిమాను ఉన్నతంగా తీర్చిదిద్దారని, సంప్రదాయాలను, విలువలను ఆయన ఎలా ఆదర్శప్రాయంగా చిత్రించారో ఎత్తిచూపారని మోదీ కొనియాడారు. ప్రసార సమయంలో, మోడీ బాలీవుడ్(Bollywood) ప్రముఖులు తపన్ సిన్హా, రాజ్ కపూర్‌లను కూడా ప్రస్తావించారు. భారతీయ సినిమావైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని ప్రధాని వెల్లడించారు. వచ్చే ఏడాది ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌(Audio Visual Entertainment Summit)కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుందన్నారు. ఈ సమ్మిట్ ఇండియాలో నిర్వహించడం ఇదే లొలిసారని పేర్కొన్నారు. రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తియిన సందర్భంగా ప్రత్యేక వెబ్ సైట్ ఏర్పాటు చేస్తామన్నారు. రాజ్యాంగంపై మీ అభిప్రాయాలు ఈ వెబ్ సైట్ లో పంచుకోవాలని కోరారు. జనవరి 13 నుంచి జరిగే మహాకుంభమేళ.. ఐక్యతా వేళా అన్నారు. కుంభమేలా నిర్వహణకు ఏఐ సహా ఆధునిక సాంకేతికత వాడనున్నట్లు తెలిపారు. కుంభమేళా(Kumbh Mela) సమాచారం తెలుసుకునేందుకు ఏఐ చాట్ బాట్. కుంభమేళాలో ప్రమాదాల నివారణకు రోబోటిక్ ఫైర్ టెండర్లు ఏర్పాటు చేస్తామన్నారు.