12 July, 2026 | 2:13 PM

Breaking News

రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •   42వ డివిజన్‌ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు   •   "సర్" ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి   •   మద్రాస్ తండాలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక   •   గాయని జానకి మృతికి విజయ్, నటులు, సంగీతకారులు సంతాపం   •   గాయని ఎస్.జానకి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •  

ఢిల్లీలో ఆపరేషన్ లోటస్

30-12-2024 02:15 AM

బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని బీజీపీకి అర్థమైపోయిందని అందుకే పార్టీ గెలుపు కోసం కొత్త ఎత్తుగడలు వేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఆపరేషన్ లోటస్ స్కామ్ పేరిట డిసెంబర్ 15 నుంచి విశ్వ ప్రయత్నాలు షురూ చేసిందని విరుచుకుపడ్డారు.

తాజాగా మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ లోటస్‌లో భాగంగా ఓటరు జాబితాను ట్యాంపరింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని రోజులుగా న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ తన ఆపరేషన్‌ను కొనసాగిస్తోంది.

ఈ 15 రోజుల్లో 5 వేల మంది ఓటర్లను తొలగించేందుకు కొత్తగా దరఖాస్తులు వచ్చాయి. అంతేకాకుండా 7,500 మంది ఓటర్లను జాబితాలో చేర్చేందుకు అప్లికేషన్లు వచ్చాయి. 12 శాతం ఓట్లలో అవకతవకలు జరుగుతోందని కేజ్రీవాల్ వాపోయారు.