19 April, 2026 | 1:02 PM

పవన్ కళ్యాణ్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ

19-04-2026 11:25 AM

న్యూఢిల్లీ: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం మాట్లాడి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. ఆయన అసాధారణమైన ధైర్యశాలి, సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. శనివారం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఉపముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

శస్త్రచికిత్స అనంతరం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలన్నారు. ఆయన త్వరగా తిరిగి బలాన్ని పుంజుకుని, మునుపటి కంటే మరింత ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆశిస్తున్నాను," అని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. 'ఉప ముఖ్యమంత్రి చికిత్స అనంతరం త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యం పొందేందుకు ఆ భగవంతుడు శక్తిని ప్రసాదించాలని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.