భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ
09-06-2024 07:38 PM
న్యూఢిల్లీ : భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్ లో ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి వివి దేశాల అధినేతలతో పాటు, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు హాజరయ్యారు.






