14 July, 2026 | 9:58 AM

మన్మోహన్ సింగ్‌ సాధారణ జీవితం గడిపారు

27-12-2024 11:48 AM

న్యూఢిల్లీ: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో చికిత్స పొందుతూ గత రాత్రి మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌( Manmohan Singh)కు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఆర్థికవేత్తగా, సంస్కరణల సారధిగా మన్మోహన్ సింగ్ ను దేశం గుర్తిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. ఆర్ బీఐ(RBI) గవర్నర్ సహా అనేక కీలక పదవుల్లో సేవలందించారని కొనియాడారు. పీవీ హయాంలో ఆర్థికమంత్రిగా దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చివేశారని చెప్పారు. దేశం, ప్రజల పట్ల ఆయన సేవాభావం స్మరించుకోదగిందని తెలిపారు. విలక్షణ పార్లమెంటేరియన్ గా ఆయన సేవలందించారని గుర్తుచేసుకున్నారు. ఎన్నో కీలక పదవులు అధిష్టించినా సామాన్య జీవితం గడిపారన్నారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ఆయనతో చాలాసార్లు మాట్లాడానన్న ప్రధాని తన తరుఫున, దేశ ప్రజల తరుఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని ప్రధాని మోదీ(PM Modi) చెప్పారు.