14 July, 2026 | 8:32 AM

మన్మోహన్‌ సింగ్‌ పార్థివ దేహానికి రాష్ట్రపతి నివాళి

27-12-2024 01:15 PM

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో కన్నుమూశారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ లేని లోటు పూడ్చలేనిదని మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. వ్యక్తిగతంగానూ తనకు తీరని లోటని తెలిపారు. చాలా కాలం నుంచి తనకు బాగా తెలుసన్నారు. సభ్యతకు నిలువెత్తు రూపం ఆయన అంటూ మాజీ రాష్ట్రపతి వీడియో విడుదల చేశారు. ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్ ఖడ్ మన్మోహన్ పార్థివ దేహానికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. మన్మోహన్ కుటుంబ సభ్యులకు కూడా ఆమె సానుభూతి తెలిపారు. మన్మోహన్ సింగ్(Manmohan Singh) మృతిపట్ల కేంద్ర క్యాబినెట్ నివాళులర్పించింది.