26 June, 2026 | 1:46 AM

వేటగాళ్ల ముఠా గుట్టురట్టు

26-06-2026 12:00 AM
  1. 5 నాటు తుపాకువిలు, ఒకటి ఎయిర్ గన్, పేలుడు పదార్థాలు, రెండు బైకులు స్వాధీనం 
  2. 8 మంది సభ్యులు గల ముఠా అరెస్ట్, రిమాండ్ 
  3. ముఠాను పట్టుకున్న పోలీసులకు క్యాష్ అవార్డు 
  4. ఎస్పీ రాజేష్ చంద్ర 

కామారెడ్డి, జూన్ 25 (విజయక్రాంతి): నాటు తుపాకులతో ఆక్రమ జంతువుల వేట కొనసాగిస్తున్న ముఠా ను కామారెడ్డి జిల్లా పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఐదు నాటు తుపాకులు, ఒక ఎయిర్ గన్, పేలుడు పదార్థాలతో పాటు రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. జంతువుల అక్రమ వేట కొనసాగిస్తున్న 8 మంది ముఠాను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

గురువారం కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జంతువుల అక్రమ వేట కొనసాగిస్తున్న ముఠా వివరాలను వెల్లడించారు. ఆపరేషన్ కవచ్ లో భాగంగా కామారెడ్డి పోలీసులు పంజా విసిరి అక్రమ నాటు తుపాకులు కలిగివుండి అక్రమ వేట కొనసాగిస్తున్న ముఠాను పోలీసులు ఎంతో ధైర్య సాహసాలు చేసి ముఠాను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈ నెల 24న కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మొండి సడక్ వద్ద చిన్న రాంపూర్ రోడ్డుపై ఆపరేషన్ కవచ్ లో భాగంగా గాంధారి పోలీసులు వాహనాలను తనిఖీ చేసిండగా రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన వారు పోలీసులను చూసి పరారీ అవుతుండడంతో పోలీసులు వెంబడించి వారిని పట్టుకుని విచారణ చేపట్టారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సదాశివ నగర్ సిఐ సంతోష్ కుమార్ తో పాటు గాంధారి, తాడువాయి, ఎస్త్స్రలు పోలీస్ సిబ్బందితో మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అడవి జంతువుల అక్రమ వేటకు పాల్పడుతున్న ఎనిమిది మంది సభ్యుల ముఠాను అరెస్టు చేసి, వన్యప్రాన్ల వేటకు ఉపయోగించేందుకు కొనుగోలు చేసిన ఐదు నాటు తుపాకులు, ఒక ఏర్ గన్, పేలుడు సామాగ్రి, ఇతర వేట వస్తువుల సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

వర్షం వల్ల వేట కొనసాగక పోవడంతో రెండు బైకులపై వేను తిరుగుతున్న క్రమములో పోలీసులు వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్న తరుణంలో పోలీసులు రెండు బైకులపై పారిపోతుండడంతో వారిని వెంబడించి పట్టుకొని విచారించగా కామారెడ్డి జిల్లా గాంధారి మండలo గండివేట్ తండాకు చెందిన చెందిన విస్లావత్ చందర్, విస్లావత్ గోపీచంద్, అంగోత్ లక్ష్మణ్, విస్లావత్ నాను, విస్లావత్ గణేష్, నస్రుల్లాబాద్ మండలం హాజీపూర్ కు చెందిన సలావత్ చందర్, సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం రామచంద్ర తండా చెందిన అంగోత్ ధర్మానాయక్, అలియాస్ ధర్మ, బాన్సువాడ మండలం చిన్న రాంపూర్ కు చెందిన అస్లాం చావుస్ లను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్పీ తెలిపారు. 

వీరు అస్లాం చావుస్ వద్ద పదివేలకు ఒకటి నాటు తుపాకిని కొనుగోలు చేసినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసును సమర్థవంతంగా సేధించిన సదాశివ నగర్ సిఐ సంతోష్ కుమార్, గాంధారి ఎస్త్స్ర మహేందర్, తాడువా ఎస్త్స్ర నరేష్, పోలీస్ సిబ్బంది సంతోష్, పెంటయ్య, హోంగార్డ్ వీరప్రసాద్ లను జిల్లా ఎస్పీ అభినందించారు. వారికి రివార్డులను  అందజేశారు. ఈ సమావేశంలో ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసరావు, సదాశివ నగర్ సిఐ సంతోష్ కుమార్, గాంధారి ఎస్త్స్ర మహేందర్, తాడువాయి ఎస్త్స్ర నరేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.