26 June, 2026 | 1:46 AM

అక్రమ గుడిసెల తొలగింపు

26-06-2026 12:00 AM

బాధితులు, అధికారులకు మధ్య వాగ్వాదం

పటాన్ చెరు, జూన్ 25 : పటాన్చెరు మం డలం పెద్ద కంజర్ల గ్రామంలోని సర్వే నంబర్ 125 కు సంబంధించి ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో ఏర్పాటు చేసిన అక్రమ గుడిసెలను రెవెన్యూ, హెచ్‌ఎండీఏ, పోలీస్ అధికారులు భారీ బందోబస్తు మధ్య తొలగించారు. ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని పెద్దకంజర్లలోప్రభుత్వానికి చెందిన అసైన్డ్ భూములను కొందరు వ్యక్తులు ఆక్రమించి అనధికారికంగా నిర్మించిన నిర్మాణాలను అ ధికారులు తొలగించారు. ఈ సమయంలో బాధితులు, అధికారులకు మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెవెన్యూ సిబ్బంది జేసీబీల సాయంతో ఈ ఆక్రమణలను పూర్తిగా తొలగించారు.