calender_icon.png 14 July, 2025 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భగత్ నగర్‌లో ఘనంగా పోచమ్మ తల్లి బోనాల జాతర

14-07-2025 12:00:00 AM

కొత్తపల్లి, జులై 13(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని ఆదివారం రోజున భగత్ నగర్ మున్నూరు కాపు సంఘం ఆద్వర్యంలో నిర్వహించిన పోచమ్మ తల్లి భోనాల జాతరకు బీజేపి నా యకులు మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నెత్తిన బోనమెత్తి బోనాల ఊరేగింపును ప్రారంభించారు. పెద్ద ఎత్తున మహిళలతో కలిసి మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు బోనమెత్తుకొని ఊరేగింపు తో పోచమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ పోచమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, మైసమ్మ తల్లి, మహాకళి అ మ్మవారికి బోనాలు, కళ్ళు శాఖ, యాట పుంజులతో ప్రజలు మొక్కులు చెల్లించు కోవడం తెలంగాణ రాష్ట్ర ప్రజల సంస్కృతి, సంప్రదాయం అన్నారు. తదుపరి మున్నూరు కాపు సంఘం పెద్ద లు గౌరవంగా శాలువాతో సత్కరించారు.

పోచమ్మతల్లి బోనాల జాతరకు సౌకర్యాలు కల్పించిన సునీల్ రావు కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షు లు వెంకన్న, సంఘ ఉపాధ్యక్షులు రవీందర్, సంఘ నాయకులు తోట వెంకట రాములు, కర్ర సత్తయ్య,అంజనేయులు, స్థానికులు ఉపెందర్, వెంకటరావు, రాజ్ ప్రభాకర్ మరియు మహిళ లు పెద్ద సంఖ్యలోపాల్గొన్నారు.