14-07-2025 12:00:00 AM
కరీంనగర్, జూలై 13 (విజయ క్రాంతి): కరీంనగర్ పట్టణంలోని మహాలక్ష్మి కళ్యాణ మండపంలో పైవేట్ పాఠశాలల కరస్పాండెంట్స్ స్కూల్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ 2025 కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ఎం ఓ యు పద్ధతిలో ప్రభత్వ పాఠశాలలోని 6 గురు విద్యార్థులను దత్తత తీసుకుని దాదాపు 6 నెలల పాటు శిక్ష ణ ఇచ్చి అంతర్జాతీయ వేదిక పైన మాట్లాడేలా సిద్దం చేసిన పారమిత విద్యసంస్థల చైర్మన్ డాక్టర్ ఈ. ప్రసాద్ రావు ను యాజమాన్యాన్ని అభినందించారు.
ప్రముఖ విద్యా వేత్త మాజీ ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజారామ్ మారుతున్న కాలానుగుణంగా పాఠశాలల పరిపూర్ణ విద్యా భివృద్ధి కొరకు మెళకువలను వివరించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 100 ప్రైవేట్ పాఠశాలల యాజ మాన్యాలుపాల్గొన్నాయి.