వైభవంగా పోచమ్మతల్లి విగ్రహప్రతిష్ఠాపన

27-04-2024 01:02:37 AM

పటాన్‌చెరు, ఏప్రిల్ 26 (విజయక్రాంతి) : అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ షిర్డిసాయి కాలనీలో నూతనంగా నిర్మించిన పోచమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవా లు శుక్రవారం వైభవంగా జరిగాయి. అమీన్‌పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాభివృద్ధికి తన సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు. అనంతరం పాండురంగారెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకుల ను ఆలయ కమిటీ సన్మానించింది. కార్యక్రమంలో కౌన్సిలర్లు బోయిని బాలమణిబాలరాజు, కృష్ణ, కోరాఆప్షన్ సభ్యులు తలారి రాములు, నా యకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.