ఓటే ఆయుధం..!
27-04-2024 01:03 AM
భవిష్యత్తును నిర్మిస్తుంది.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది.. స్వేచ్ఛా వాయువులను అందిస్తుంది.. ఇన్ని ఆయుధాలను మనకు ఇచ్చేది ఎవరో కాదు.. మీ ఓటే.. అందుకే ఎంతో విలువైన ఓటును ప్రతి ఓటరు వినియోగించుకోవాలి. ఓట్ల పండుగ వచ్చిందంటే చాలు దేశమంతా సందడి నెలకొంటుంది. తాజాగా మహారాష్ట్రలోని థానేలో ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇలా విద్యార్థులు ఓటు ఆకారంలో నిల్చున్నారు. ఈ ఫొటో అందరినీ ఆకట్టుకుంటోంది.






