పోక్సో కేసు.. 20 ఏళ్ల జైలు
20-05-2026 12:00 AM
ఫలించిన రాంగోపాల్‌పేట్ పోలీసుల కృషి
సికింద్రాబాద్, మే 19 (విజయక్రాంతి): 2019 అక్టోబర్ 29న రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో ఎట్టకేలకు నిందితుడికి మంగళ వారం సికింద్రాబాద్ ప్రత్యేక సెషన్స్ కోర్టు నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 11 ఏళ్ల బాలుడిపై టోడ్రైవర్ లైంగికదాడికి ఒడిగట్టాడు. అప్పట్లో ఈ కేసు సంచలనం గా మారింది. రాంగోపాల్ పే ట్ పోలీసులు కేసు నమోదు చేసి, పక్కాగా అభియోగాలు, నేరం జరిగిన తీరు, తదితర వివరాలను చార్జీషీట్‌లో పొం దుపరిచి కోర్టులో నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టారు. దీంతో ప్రత్యేక సెషన్స్ కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.






