సేవోత్తమ్ శిక్షణలో ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు

24-08-2026 | 10:59pm

గణపురం,(విజయక్రాంతి): ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన, బాధ్యతాయుతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోని డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహిస్తున్న రెండు రోజుల సేవోత్తమ్ శిక్షణ కార్యక్రమంలో కర్ణకంటి నరేష్, ముక్కెర హేమంత్, పందిరి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆగస్టు 24 నుండి 25వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రజా సేవల నాణ్యత పెంపు, పౌరుల సంతృప్తి, సమర్థవంతమైన సేవల అందజేత, పారదర్శకత, జవాబుదారీతనం వంటి అంశాలపై శిక్షణ అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు