26 February, 2026 | 4:37 AM

పోలీస్ కళాబృందం అవగాహన

26-02-2026 12:34 AM

కామారెడ్డి,ఫిబ్రవరి 25, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని పోసానిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పోలీసులు పలు అంశాలపై, రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, హైటెక్ మోసాలు వంటి వాటిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర  ఆదేశానుసారం సబ్-ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, మైనర్ డ్రైవింగ్, సైబర్ నేరాలు, టోల్ ఫ్రీ నంబర్ 1930, షిటీమ్స్, వివిధ సామాజిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

షి టీమ్ నం 8712686094, అత్యవసర సమయంలో డైల్ 100 కాల్ చేయాలని, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని, మంచి లక్ష్యంతో చదువు కోవాలని, ఏ చిన్న కేసు అయినా జీవితాలు నాశనం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, శేషరావు, సాయిలు, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, గందె ప్రశాంత్ కుమార్, జ్యోత్స్న, శివకృష్ణ, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు  పాల్గొన్నారు.