18 August, 2026 | 6:30 PM

ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ

18-08-2026 04:43 PM

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని ఘనపూర్ గ్రామంలో రైతులకు ఆర్ పి యల్ పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ, ఎన్. వెంకట్ రామ్ రెడ్డి నానో యూరియా, నానో డి ఏ పి వినియోగం, ఫలితాల గురించి రైతులకు వివరించారు. అలాగే నాణ్యమైన విత్తనాల ఎంపిక, సమగ్ర సస్యరక్షణ చర్యలు, కూరగాయల సాగులో ఆధునిక సాంకేతికతలు, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, ఎల్ నినో పరిస్థితుల గురించి వివరించారు. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు.