10 July, 2026 | 3:04 AM

1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు

10-07-2026 01:27 AM

భద్రతా విధులపై దిశానిర్దేశం చేసిన పోలీస్ కమిషనర్

ఖమ్మం టౌన్, జులై 9 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా, చింతకాని మండలం, జగన్నాధపురంలో ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద సభకు నేడు ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో 1500 మంది పోలీసులతో బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందితో గురువారం ఆయన సమావేశమై  భద్రతా ఏర్పాట్లు, విధుల నిర్వహణ, సమన్వయంపై సమగ్ర దిశానిర్దేశం చేశారు.

కేటాయించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బందోబస్త్ లో 4 అడిషనల్ డిసిపీ లు, 12 గురు ఏ సి పి లు, 58 సి ఐ లు, 151 ఎస్ ఐ లు, 1300  ఇతర అధికారులు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీ లు సారంగపాణి, తిరుపతి రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.