10 July, 2026 | 2:29 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్, ఎస్పీ

10-07-2026 01:28 AM

భూపాలపల్లి, జులై 9 (విజయక్రాంతి) జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జె. జీవన్ కుమార్ను గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలి పారు.

అనంతరం పెండింగ్లో ఉన్న కోర్టు కేసుల పురోగతిపై చర్చించారు. కేసులు త్వరితగతిన పరిష్కారానికి జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి. అఖిల లు పాల్గొన్నారు.