10 July, 2026 | 3:04 AM

‘మీ సేవ’ ద్వారా యూరియా బుకింగ్ సక్సెస్!

10-07-2026 01:26 AM

మహబూబాబాద్, జులై 9 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నెట్వర్క్ సౌకర్యం సరిగా లేని ప్రాంతాల రైతులకు, ఆండ్రాయిడ్ ఫోన్ లేని రైతులకు యాప్ ద్వారా యూరియా అందించడానికి ‘మీ సేవ’ ద్వారా చర్యలు చేపట్టాగా, గురువారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని వాళ్ళు ఏజెన్సీ గ్రామాల రైతులకు మీసేవ ద్వారా యూరియా బుకింగ్ చేసి యూరియా పంపిణీ చేశారు. బయ్యారం మండలంలోని కొత్తపేట మీ సేవా కేంద్రంలో గురువారం మండల వ్యవసాయ అధికారి రాజు కీప్యాడ్ మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్న రైతులు, మొబైల్ నెట్వర్క్ సౌకర్యం లేని గ్రామాల రైతులకు యూరియా బుకింగ్ విధానంపై అవగాహన కల్పించడంతో పాటు, కొంతమందికి మీ సేవా కేంద్రం ద్వారా యూరియా బుకింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా రైతులకు యూరియా బుకింగ్ విధానం, దాని ప్రయో జనాలు, నిర్ణీత సమయంలో ఎరువులను పొందేందుకు  బుకింగ్ యొక్క ప్రాముఖ్య తను వివరించారు. స్మార్ట్ఫోన్ లేదా మొబైల్ నెట్వర్క్ సౌకర్యం లేని రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సమీపంలోని మీ సేవా కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు.  ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ విధానాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని, అవసరమై నప్పుడు మీ సేవా కేంద్రాల ద్వారా యూ రియా బుకింగ్ చేసుకోవాలని కోరారు.