17-07-2025 12:56:28 AM
మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని గంజాయి వినియోగదారులకు సిఐ.రామచందర్ రావు ఆధ్వర్యంలో బుధవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. సిఐ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తును పాడు చేసుకోవద్దని, గంజాయి, డ్రగ్స్ తీసుకోవడం వల్ల మన కుటుంబాన్ని నష్టపోవడంతో పాటు కొన్ని రోజుల తర్వాత మతిస్థిమితం కోల్పోవడం జరుగుతుందని, శరీరం ఆరోగ్యపరంగా అన్ని సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుందని, తమ భవిష్యత్తు అంధకారం అవుతుందని, ఈ మత్తు పదార్థాలు వాడటం వల్ల జరిగే నష్టాలను వివరించారు. గంజాయి,డ్రగ్స్ అమ్మినా కొనుగోలు చేసిన తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై పవన్ కుమార్ తో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, హోంగార్డులు పాల్గొన్నారు.