calender_icon.png 17 July, 2025 | 5:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ పత్రాలతో ప్రభుత్వ స్థలం కబ్జా

17-07-2025 12:57:05 AM

  1. జాగృతి జిల్లా అధ్యక్షుడితోపాటు అతడి బావ అరెస్టు

డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడి

ఆదిలాబాద్, జూలై 16 (విజయక్రాంతి): తహసీల్దార్ ఇచ్చినట్టు నకిలీ రెగ్యులైజేషన్ ఉత్తర్వుల సృష్టించి, ఫోర్జరీ, నకిలీ పత్రాలతో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన కేసులో ఒకే కుటుంబంలో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. 

శాంతినగర్ చెందిన రంగినేని సూర్యప్రకాశ్ అనే వ్యక్తి తన కుమారుడు తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు రంగినేని శ్రీనివాస్, కుమార్తె రంగినేని స్వేత, అల్లుడు జలగం అముల్ తో కలిసి ప్రభుత్వ భూమిని ఆక్రమించి కబ్జా చేసిన ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. 

విచారణ చేపట్టి రంగినేని శ్రీనివాస్ రా వు, అతని బావ జలగం అమూల్‌ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఇక రంగినేని శ్రీనివాస్, ఆయన కుటుంబ సభ్యులు కావాలనే రోడ్డును కబ్జా చేసి నకిలీ చలాన్లను సృష్టించి మున్సిపాలిటీ ద్వారా అక్రమంగా హౌస్ నెంబర్, నకిలీ క్రమబద్ధీకరణ ఉత్తరువులను సృష్టించారన్నారు. ఆ స్థలాన్ని కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం జరిగిందని తెలిపారు.

విచారణలో ఎలాంటి రుసుములు చెల్లించలేదని, చాలన్ నెంబర్ నకిలిదే, రెవెన్యూ అధికారులు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు నకిలీవి అని తేలిందన్నారు. ఈ పత్రాలను రెవెన్యూ అధికారులు నకిలీవి అని నిర్ధారించారన్నారు. మీడియా సమావేశంలో వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్, రూరల్ సీఐ ఫణిదర్  పాల్గొన్నారు.