7 April, 2026 | 10:16 PM

మర్డర్‌ కేసును చేధించిన పోలీసులు

07-04-2026 08:22 PM

– బంధువులే సుపారీ ఇచ్చి హాత్య చేయించారు

– విలేకరుల సమావేశంలో కల్వకుర్తి డీఎస్పీ వెంకట్‌రెడ్డి

కల్వకుర్తి: వెల్దండ మండల కేంద్రంలో ఈ నెల 3వ తేదీన వెల్దండ మండల సమీపంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన మహేష్‌ హాత్యా పధకాన్ని పోలీసులు చేధించి, నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లుగా కల్వకుర్తి డీఎస్పీ వెంకట్‌రెడ్డి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హాత్యకు సంబంధించిన వివరాలిలా... వెల్దండ మండలానికి చెందిన రుద్రాక్షల సాయిలుకు ముగ్గురు భార్యలు మొదటి భార్య జంగమ్మకు రుద్రాక్షల కృష్ణయ్య, రెండవ భార్య అంజనమ్మకు శివశంకర్, మహేష్‌లు, మూడవ భార్య అయిన మానుపాటి పెద్ద వెంకటమ్మకు అన్వేష్, శివ, పవన్‌లు ఉన్నారు.

పెద్ద వెంకటమ్మకు కల్వకుర్తిలో ఉన్న పందుల షెడ్డును పలు కారణాల కారణంగా తీసివేయగా, దానిని 2023లో రుద్రాక్షల సాయిలు తన వ్యవసాయ పొలంలో పెట్టించాడు. ఇదే విషయంలో తన రెండో భార్య పిల్లలైనా రుద్రాక్షల మహేష్, శివశంకర్‌ లకు ఇష్టం లేక వాళ్లకు గొడవలు జరిగాయి. రుద్రాక్షల సాయిలు తన కూతురుకు 20 గుంటల పొలం రిజిస్ట్రేషన్‌ చేయడానికి వెల్దండలో స్లాట్‌ బుక్‌ చేయగా రుద్రాక్షల మహేష్‌ అడ్డుకున్నాడు.

ఈ విషయంలోనూ మొదటి, రెండో భార్య పిల్లలకు గొడవలు జరిగి వెల్దండ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదవ్వగా, కల్వకుర్తికి చెందిన బెల్లంకొండ రాములు పందులు దొంగతనమైన విషయంలో మానుపాటి పవన్, శివ, అన్వేష్‌ దొంగతనంగా తెచ్చిన పందులు వారి షెడ్డు ఉన్న వెల్దండలో ఉంచారని రుద్రాక్షల మహేష్‌ బెల్లంకొండ రాములు గారికి సమాచారం ఇచ్చి కల్వకుర్తి పోలీస్‌ స్టేషన్లో వీరిపైన దొంగతనం కేసు చేయించినప్పటి నుండి వాళ్లు మా పందులను తీసుకుపోతామని వెల్దండకు రాగా అక్కడ జరిగిన గొడవల్లో ఈ నిందితులే బెల్లంకొండ రాములును చంపేశారు. రాములు హాత్య కేసులో నిందితులు జైలుకు Ðð ళ్లగా, హాత్య కాబడ్డ మహేష్‌ను ఎరుకల సంఘం అధ్యక్షులుగా ఎంపిక కాగా, ఇతను ఎదుగుతే మమ్మల్ని బ్రతకనివ్వడం లేదని అతని ఏ విధంగా అయినా చంపాలని నిందితులు నిర్ణయించుకున్నారు.

– హాతమార్చటం కొరకు స్నేహాం

రుద్రాక్షల మహేష్‌ను హాతమార్చేందుకు నిందితులంతా ఒకే తండ్రి పిల్లలు కావటంతో వారంతా మహేష్‌తో స్నేహాన్ని ఏర్పరుచుకున్నారు. వీరంతా జైలుకు వెళ్లి వచ్చినప్పటి నుండి స్నేహాన్ని బాగా ఏర్పరచుకొని అతని పూర్తి కదలికలను నిశితంగా గమనించారు. అతని కదలికల ఆధారంగా పధకం ప్రకారం అతనిని చంపాలని నిర్ణయించుకొని, మనము చంపేస్తే అనుమానం వస్తుందని, ఎలాగైనా దీనిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు సుపారీ ఇచ్చి టిప్పర్‌తో గుద్ది దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న ప్లాన్‌ ప్రకారం టిప్పర్‌తో పాటుగా డ్రైవర్‌కు సుపారీ ఇచ్చి హాత్య చేసేందుకు ప్లాన్‌ చేసుకున్నారు.

సుపారీ ఇచ్చి...

రుద్రాక్షల మహేష్‌ను హాతమార్చాలని కల్వకుర్తి పట్టణంలోని గాజులవాడకు చెందిన బురాన్‌ అనే టిప్పర్‌ డ్రైవర్‌కు రూ.2లక్షలకు సుపారీ ఇచ్చారు. టిప్పర్‌ సహాయంతో హాతమార్చేందుకు బురాన్‌కు విషయం చెప్పి, హాత్యను పూర్తిగా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని చెప్పగా, అతను సరే అని బేరాన్ని కుదుర్చుకున్నాడు. మహేష్‌ను చంపాలని నిర్ణయించుకున్న తర్వాత టిప్పర్‌తో గుద్దిన తర్వాత, అతను చనిపోకపోవటంతో, టిప్పర్‌ డ్రైవర్‌ బురాన్‌ మహేష్‌ కాళ్లు పట్టుకోగా, అన్వేష్, శివ, మహేష్‌లు అతని తల, మొహాంపైన బండరాయితో మోది హాత్య చేశారు. కేసును విచారించిన వెల్దండ సీఐ రఘువీర్‌ రెడ్డి, ఎస్‌ఐ కురుమూర్తిలు నిందితులను కల్వకుర్తి పట్టణంలోని తిమ్మరాశిపల్లి వద్ద ఉన్న పందుల షెడ్డు వద్ద అదుపులోకి తీసుకొని, రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ తెలిపారు. కేసులో నిందితులుగా ఉన్న అన్వేష్, శివ, పవన్, వెంకటమ్మ, కృష్ణయ్య, బురాన్‌ల నుండి ఆరు సెల్‌ఫోన్లు, టిప్పర్, కారును సీజ్‌ చేశామని డీఎస్పీ తెలిపారు. కేసును త్వరగా చేధించిన వెల్దండ సీఐ, ఎస్‌ఐ, సిబ్బందిని జిల్లా ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్, కల్వకుర్తి డీఎస్పీ వెంకట్‌ రెడ్డి, అభినందించారు