అల్లరిమూకల ఆగడాలను అరికట్ట డంలో పోలీసులు విఫలం
18-08-2026 12:00 AM
కూకట్ పల్లి, ఆగస్టు 17,(విజయక్రాంతి): కెపిహెచ్ బి కాలనీ ధనలక్ష్మీ సెంటర్ వద్ద గత రెండు రోజుల క్రితం అల్లరి మూకల బారిన పడి గాయాలపాలైన బాధితులను కూకట్ పల్లి నియోజకవర్గ బిజెపి ఇన్ ఛార్జ్, నిజామాబాద్ జిల్లా బిజెపి ఇన్ ఛార్జ్ మాధవరం కాంతారావు సోమవారం పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి తోట రమేష్,మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అర్బన్ ఐటి సెల్ కన్వీనర్ నర్వ పవన్ కుమార్,కూకట్ పల్లి నియోజకవర్గం ఓబీసీ మోర్చా కన్వీనర్ వినోద్ గౌడ్,బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






