18 August, 2026 | 3:01 AM

ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం

18-08-2026 12:00 AM

కుబీర్ ,ఆగస్టు 17 ( విజయక్రాంతి): లోకేశ్వరం మండలం రాజుర గ్రామంలో శ్రీ రామాలయ పునర్నిర్మాణ పనులను ముధోల్ ఎమ్మెల్యే ముధోల్ ఎమ్మెల్యే పవార్  సోమవారం పూజ చేసి ప్రారంభించారు.  మాట్లాడుతూ.. దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన సీజీఎఫ్ నిధులు రూ.40 లక్షలతో ఆలయ పునర్నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

ప్రజల విశ్వాసానికి ప్రతీకలైన ఆలయాల అభివృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయన్నారు. అనంతరం గ్రామంలో పాఠశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు