పోలీస్ కిష్టయ్య జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలి
ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె బోయిన అశోక్ డిమాండ్
హనుమకొండ, డిసెంబర్ 1 : మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండలోని ఆదాలత్ అమరవీరుల స్థూపం వద్ద వరంగల్ జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్ష, కార్యదర్శులు బయ్య స్వామి, పులి రజనీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అశోక్ పాల్గొ న్నారు.
కిష్టయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మలిదశ ఉద్య మంలో సబ్బండ వర్గాల పోరాటాలను చూ సి, చలించిన కానిస్టేబుల్ కిష్టయ్య తుపాకీతో కాల్చుకొని తొలి అమరుడయ్యాడని గుర్తుచేశారు. అలాంటి ముదిరాజ్ బిడ్డ జయంతి, వర్ధంతిలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో కిష్టయ్య చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు.
ట్యాంక్‌బండ్‌పై కిష్టయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముదిరాజ్ నాయకులు బుస్సా మల్లేశం, చొప్పరి సోమయ్య, ఎన్నారై రాజ్‌కుమార్, నవీన్, కృష్ణ, రమేష్, అనురాధ, చంద్ర తదితరులు పాల్గొన్నారు.




