బీఆర్‌ఎస్ గురుకుల బాట
- ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై కేసు
- ఆదిలాబాద్‌లో బీఆర్‌ఎస్వీ ప్రధాన కార్యదర్శి అరెస్టు
ఆదిలాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి)/సూర్యాపేట/ఇబ్రహీంపట్నం: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆదివారం బీఆర్‌ఎస్ నేతలు గురుకుల బాట పట్టారు. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ హాస్టళ్లను బీఆర్‌ఎస్ నాయకులు పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ బీసీ గురుకుల బాలుర పాఠశాలను ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సందర్శించారు.
అయితే ఎలాంటి అనుమతి, సమాచారం లేకుండా కళాశాలలోకి ప్రవేశించారని, విద్యార్థుల ప్రతిస్పందనలను హైలైట్ చేస్తూ ప్రస్తుత పాలనకు వ్యతిరేకంగా మాట్లాడాలని ప్రేరేపించడానికి ప్రయత్నించారంటూ కళాశాల ప్రిన్సిపాల్ ధనలక్ష్మి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆర్‌ఎస్పీపై కేసు నమోదు చేశారు.
ఆదిలాబాద్ జిల్లా మావల పరిధిలోని బీసీ గురుకుల పాఠశాలను సందరించడానికి బీఆర్‌ఎసీ రాష్ర్ట ప్రధాన కార్యదరి షేక్ పరేజ్‌తోపాటు పలువురు బీఆర్‌ఎస్వీ నాయకులు వెళ్లారు. పాఠశాలకు వెళ్లిన పర్వేజ్‌ను పోలీసులు అరెస్టు చేసి, మావల పోలీసు స్టేషన్‌కు తరలించారు.
గురుకుల పాఠశాలను సందరించడానికి ఎలాంటి అనుమతులు లేవని ఆయనను అడ్డుకున్నారు. అరెస్టును నిరసిస్తూ బీఆర్‌ఎసీ కార్యకర్తలు స్టేషన్‌కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. తమ నాయకున్ని ముందస్తు అరెస్టు చేయడాన్ని బీఆర్‌ఎసీ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ ఖండించారు.
సూర్యాపేటలోని పలు ప్రభుత్వ హాస్టళ్లను బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిగ వెంకటేష్‌గౌడ్ ఆధ్వర్యంలో సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. ఆయన వెంట సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, నాయకులు రాపోలు నవీన్, నెమ్మాది శ్రవణ్‌కుమార్, సురేష్‌నాయక్, సందీప్, పల్లెపంగ నాగరాజు ఉన్నారు.
విద్యావ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్న సర్కారు
ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కుమ్రంభీం ఆసిఫాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): విద్యా వ్యవస్థను ప్రభు త్వం భ్రష్టు పట్టిస్తోందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర కమి టీ పిలుపు మేరకు బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని పీటీజీ గురుకులాన్ని జిల్లా ఇంచార్జి ముస్తఫాతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు అం దుతున్న వసతులపై ఆరా తీశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. బడుగు, బల హీనవర్గాల విద్యార్థులకు మంచి విద్యతోపాటు నాణ్యమైన భోజనాన్ని అందిం చేందుకు కేసీఆర్ హయాంలో గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు. పదేళ్లలో ఎప్పుడూ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగలేదని.. సీఎం రేవంత్ విద్యావ్యవస్థను ఆగం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశా రు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు గుణాత్మక విద్యను అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిం గిల్‌విండో చైర్మన్ అలీబిన్ హైమద్, నా యకులు సాయి శ్రావణ్, శ్రీకాంత్, తాజ్, అరుణ్, ప్రవీణ్, రామ్‌శేఖర్ ఉన్నారు.




