15 April, 2026 | 12:38 AM

పోలీస్ అధికారుల రివార్డులు అందజేత

12-06-2025 01:16 AM

ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ 

ఏటూరునాగారం, జూ11(విజయక్రాంతి): పోలీసు శాఖ అధికారులు తమ వీధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందిస్తూ కృషి చేసిన అధికారులకు గుర్తింపుగా ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ఆదేశాల మేరకు  బుధవారం ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ చేతుల మీదుగా ఏటూరునాగారం డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు రివార్డులు అందించారు.

ఈ సందర్భంగా ఏఎస్పీ శివం ఉపాధ్యాయ మాట్లాడుతూ తమ విధుల్లో అత్యుత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు గుర్తింపుగా పోలీస్ శాఖ రివార్డులు ప్రదానం చేసింది. అన్నారు.పోలీసు శాఖ, అధికారుల కృషి చేసిన అధికారులకు ప్రోత్సాహకంగా రివార్డులు అందించడం జరుగుతుందని పోలీస్ అధికారులు ఉత్తమ సేవలు అందించి ప్రజలకు రక్షణ కల్పిస్తూ  తమ విధి నిర్వహణలో ఉత్తమ అధికారులుగా ముందుకు సాగాలన్నారు.

సమాజంలో పోలీసులంటే ప్రజలు గౌరవించే విధంగా అంకితభావంతో విధులు నిర్వహించాలని అన్నారు. ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రజలలో అధికారుల వద్ద ప్రత్యేక గుర్తింపు ఎప్పుడు ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో సిఐ అనుముల శ్రీనివాస్. వెంకటాపూర్ సిఐ బండారి కుమార్. ఏటూరునాగారం మంగపేట వాజేడు కన్నాయిగూడెం. ఎస్త్స్ర లురాజ్ కుమార్  టీవిఆర్ సూరి. తాజుద్దీన్ ,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.