calender_icon.png 28 June, 2025 | 1:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీ పాలనలో విశ్వసనీయ భారత్

12-06-2025 01:17:54 AM

- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 

- బీజేపీ ఆఫీసులో ‘11 సంవత్సరాల సావనీర్’

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనపై సావనీర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం హాజరైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు బీజేపీ తెలంగాణ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి మీర్ ఫిరాసత్ అలీ బక్రీ ఆధ్వర్యంలో రాష్ట్ర నేతలు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సం దర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో భారతదేశం సాగిన ప్రయాణాన్ని ప్రతిబింబించేలా 11 సంవత్సరాల ప్రత్యేక సావనీర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘గత 11 సంవత్సరాలలో, భారతదేశం విశ్వసనీయమైన, బాధ్యతాయుతమైన, పారదర్శకమైన, జవాబుదారీతనం కలిగిన, నిర్ణయాత్మకమైన, ప్రజలపై దృష్టి సారించిన ప్రభుత్వాన్ని చూసింది. మేము 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చాము. లక్షలాది మంది రైతులు, యువత, మహిళలకు సాధికారత కల్పించాము.

భారతదే శాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాలుగు బలమైన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా మార్చా ము” అని వ్యాఖ్యానించారు. దేశ విద్య, సాంకేతిక పురోగతికి దక్షిణ భారతదేశం, ముఖ్యంగా తెలంగాణ అందించిన సహకారం మరువలేదని ప్రశంసించారు. ‘దక్షిణ భారతదేశం దేశ విద్యా కేంద్రంగా మారింది,, తెలంగాణ ఈ పరివర్తనకు కిరీటంగా ఉద్భవించింది’ అని ఆయన అన్నారు.