24 August, 2026 | 10:33 AM

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో మరో ముగ్గురి అరెస్ట్

24-08-2026 10:01 AM

హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్(Minister Konda Surekha former OSD) కేసులో మరో ముగ్గురి అరెస్ట్ అయ్యారు. మార్టూరులో అరుణ్ కుమార్, మహేందర్ రెడ్డి, కార్తీక్ రెడ్డిలను ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులకు(Jubilee Hills Police) అప్పగించారు. మాజీ OSD సుమంత్ కేసులో కేసులో ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిన్న కొండా సురేఖ(Minister Konda Surekha) మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ అరెస్ట్ ను పోలీసులు అరెస్టు చేశారు. తెల్లాపూర్‌లోని సుమంత్ ఇంటి ముందు అరెస్ట్ చేశారు. ఓ వ్యాపారిని రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి, ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేశాడని సుమంత్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.ఈ కేసులో సుమంత్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.