మొక్కును చెల్లించుకున్న దంపతులు.. శ్రీ సీతారామచంద్ర స్వామికి వెండి కానుకలు
అర్చకులకు అందించిన కానుకలు
తన్నీరు సరిత ప్రసాదరావు
ముస్తాబాద్, 24(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం(Mustabad Mandal) పోతుగల్ గ్రామానికి చెందిన తన్నీరు భారతి రాజేశ్వరరావుల కుమారుడు ప్రసాద్ రావు తన సతీమణి సరిత దంపతులు గ్రామంలోని శివకేశవ ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామికి మొక్కును చెల్లించి వెండి కానుకలు సమర్పించారు. సుమారు ఐదు లక్షల విలువైన 2 కేజీల వెండితో తయారు చేసిన తీర్థ పాత్రలు,తాంబలం, మంగళహారతి వెండి సెట్‌ను ఆలయ అర్చకులకు అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ యాదమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ పుట్టి పెరిగిన ఊరిలో గ్రామస్తులు చల్లగా ఉండాలని ఏండ్ల చరిత్ర కల్గిన మన శివ కేశవ ఆలయంలోని సీతారామచంద్రస్వామికి కానుకలు చెల్లించడం హర్షణీయమని పేర్కొన్నారు.మనస్ఫూర్తిగా మంచి కోసం మొక్కిన మొక్కులు తీరుతాయని గ్రామ ప్రజల విశ్వాసమని పూర్వికులు,అర్చకుల ద్వారా తెలుస్తుందన్నారు. సరిత ప్రసాద్ రావు దంపతుల భక్తిశ్రద్ధలు వారి ఉదారతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
స్వామివారికి భక్తిశ్రద్ధలతో కానుకలు సమర్పించిన దాతల కుటుంబానికి,గ్రామ ప్రజలకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకులు దీవించారు.ఈ కార్యక్రమంలో అర్చకులు కృష్ణమాచారి,భక్తులు రాజేందర్,రాజేందర్ రావు, కనకయ్య,శ్యామల,ఉమాదేవి దేవయ్య,దర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.






