కోడి పందాల శిబిరంపై పోలీసుల దాడి
04-03-2026 12:00 AM
- రూ.65 వేల నగదు, 17 కోళ్లు, 4 సెల్ ఫోన్లు,
3 మోటార్ సైకిళ్ళు, 1 బొలెరో వాహనం స్వాధీనం
మహబూబాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్తురు గ్రామ శివారులో ఉన్న మామిడి తోటలో కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఎస్త్స్ర ఉపేందర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి నిర్వహించారు.
ఈ సంఘటనలో 17 పందెం కోళ్లు, 65,400 నగదు, నాలుగు సెల్ ఫోన్లు, మూడు మోటార్ సైకిల్లు, ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకొని నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్త్స్ర తెలిపారు.




