పునరావాస భూముల వద్ద ఉద్రిక్తత
04-03-2026 12:00 AM
కడెం, మార్చి ౩ (విజయక్రాంతి): కడెం మండలంలోని నచ్చన్‌ఎల్లాపూర్ సమీపంలోని వ్యవసాయ భూముల వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. మైసంపేట పునరావాస గ్రా మానికి కేటాయించిన వ్యవసాయ భూముల వద్ద గోండు గూడ, మైసంపేట గ్రామస్థులు హోలీ సందర్భంగా పూజలు చేయడానికి వెళ్లా రు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ భూములు మావంటే మావంటూ ఇరు వర్గాల ప్రజలు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు, ఫారెస్ట్ అధికారు లు సంఘటన స్థలానికి చేరుకుని ఇరువురికి సద్దిచెప్పారు. అయితే ఈ భూములకు సంబందించి గతంలో కూడా ఆందోళనలు జరగడం తో అధికారులు ఆ భూములను పంపిణీ చేసే క్రమంలో ఇబ్బందులు పడుతున్నారు.




