రామప్ప ఆలయ ద్వార బంధనం
వెంకటాపూర్, మార్చి 3 (విజయక్రాంతి): మండలంలోని సుప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న రామప్ప శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం జరిగిన చంద్రగ్రహణం సందర్భంగా ద్వార బంధనం చేసినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. గ్రహణకాలంలో ఆలయ శాస్త్రోక్త విధానాల ప్రకారం పూజా కార్యక్రమాలు నిలిపివేసి, ఉదయం నిర్ణీత సమయానికి ఆలయ ద్వారాలను మూసివేశారు.
గ్రహణం ముగిసిన అనంతరం బుధవారం తెల్లవారుజామున ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, సంప్రో క్షణ చేపట్టనున్నట్లు కార్యనిర్వహణాధికారి వెల్లడించారు. అనంతరం స్వామివారి నిత్యపూజలు నిర్వహించి భక్తులకు దర్శనాన్ని పునఃప్రారంభించనున్నట్లు తెలిపారు. గ్రహణ సమయాల్లో ఆలయ సంప్రదాయాలను కట్టుదిట్టంగా పాటించడం జరుగుతుందని, తిరిగి బుధవారం భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చని తెలిపారు.




