ఆగని ఇసుక మాఫియా!
మహబూబాబాద్ జిల్లాలో అక్రమ రవాణా
విస్తరిస్తున్న అక్రమ రవాణా
వాగుల్లో ట్రాక్టర్ల సందడి
మహబూబాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో ఇసుక దోపిడికి అడ్డు అదుపు లేకుండా పోతోందనే విమర్శలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వాగుల నుంచి పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తెచ్చి తమ కు అనుకూలమైన ప్రదేశంలో డంపు చేయ డం, దర్జాగా ఇందిరమ్మ ఇండ్ల పేరుతో విక్రయించడం ఇసుకాసురులకు పరిపాటిగా మారిందని విమర్శలు వస్తున్నాయి.
ఇసుక అక్రమ రవాణాకు అటవీ, పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఎంత అడ్డుకట్ట వేయాలని చూస్తున్నా కొందరు ఇంటిదొంగల స హకారంతో ఇసుక రవాణాకు దొడ్డి దారులు వెతుకుతూ మాఫియాగా ఏర్పడి యధేచ్చగా ఇసుక రవాణా ఆపడం లేదనే విమర్శలు వ స్తున్నాయి. శనివారం రాత్రి గూడూరు అట వీ ప్రాంతం నుండి, అలాగే నెల్లికుదురు మండలం ఆకేరు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అటవీశాఖ, పోలీసులు పట్టుకోవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
ఇసుక మాఫియా జోరు.. వాగులే టార్గెట్ రాత్రివేళల్లో ట్రాక్టర్ల సందడి
జిల్లాలో వాగులు, చిన్న నదుల నుంచి ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయ నే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పొద్దంతా అధికారుల నిఘా ఉండడంతో ఇటీవల కొ న్ని మండలాల్లో రాత్రి వేళల్లో ట్రాక్టర్లతో వాగుల్లో ఇసుక తవ్వి సమీప పట్టణాలు, గ్రా మాలకు తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారికంగా అనుమతులు లేని ప్రాంతాల్లో కూడా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయనే విమర్శలున్నాయి.
రాత్రి సమ యంలో వాగుల వద్ద ట్రాక్టర్లు వరుసగా వెళ్లి ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తు తం నిర్మాణ రంగంలో ఇసుకకు ఉన్న డిమాండ్ కారణంగా ఈ ఇసుక అక్రమ వ్యా పారం రోజురోజుకూ పెరుగుతోందని చెబుతున్నారు. అక్రమ ఇసుక రవాణాను పలు చోట్ల గ్రామస్తులు అడ్డుకుంటున్నప్పటికీ ఇసుక మాఫియా దాడులకు దిగుతోందని వాగుల పరివాహ ప్రాంత గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇక్కడ ఎక్కువగా జరుగుతోంది
జిల్లాలో ఆకేరు వాగు,మున్నేరు వాగు, పెద్దవాగు, పాకాల, వట్టి వాగు పరివాహక మండలాల్లో ఇసుక అక్రమ రవాణా సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. నెల్లికుదురు, తొర్రూ రు, మరిపెడ, గూడూరు, గార్ల, బయ్యారం, చిన్న గూడూరు, కేసముద్రం, నర్సింహులపేట మండలాల్లోని వాగులు అక్రమ ఇసుక తవ్వకాల కేంద్రాలుగా మారాయనే ఆరోపణలున్నాయి.
వాగులే లక్ష్యం
జిల్లాలోని కొన్ని వాగుల్లో ఎక్కువగా ఇ సుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఆయా వాగుల్లో ఇసుక నిల్వ ఎక్కువగా ఉండటం, రహదారు లు దగ్గరగా ఉండటం వల్ల రవాణా సులభంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇసుక హాట్స్పాట్ గ్రామాలు
మునిగలవేడు, బ్రాహ్మణకొత్తపల్లి,ఎర్రబెల్లిగూడెం, మేచరాజుపల్లి, నెల్లికుదురు, చిన్న గూడూరు, కౌసల్యదేవ్ పల్లి, జయపురం గ్రామాల సమీపంలో వాగుల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం. ఈ గ్రామాలతో పాటు ఆకేరు, మున్నేరు, పా కాల, గూడూరు అటవీ ప్రాంతం, వట్టి వాగు పరివాహక గ్రామాలు ఇసుక అక్రమ రవాణాకు హాట్ స్పాట్ గా పేరు గడించాయి.
ఇసుక మాఫియా ఇలా పనిచేస్తుంది
వాగుల్లో ఇసుక నిల్వ ఉన్న ప్రదేశాలను ముందుగా గుర్తించడం. రాత్రి వేళల్లో మూ కుమ్మడిగా వెళ్లి ట్రాక్టర్లతో తవ్వకాలు ప్రారంభించడం. గ్రామాలకు చెందిన ఇంటర్నల్ ర హదారుల ద్వారా రవాణా తెల్లవారేలోపు ఇతర ప్రాంతాలకు తరలింపు. పగటి వేళ మ ధ్యవర్తుల ద్వారా నిర్మాణ రంగానికి సరఫరా చేస్తున్నారు.
రోజుకు వందల ట్రాక్టర్ల ఇసుక రవాణా నెంబర్లు లేని ట్రాక్టర్ల వినియోగం
రోజుకు ఒక్కోచోట 25 నుంచి 40 ట్రాక్టర్లు ఇసుక రవాణాకు వినియోగిస్తున్నా రు. ఇలా వాగుల నుండి అక్రమంగా తోడిన ఇసుకను తమకు అనుకూలమైన ప్రదేశాల్లో నిలువ చేస్తూ, రెట్టింపు ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక అక్రమ రవాణాకు నంబర్లు లేని ట్రాక్టర్లు, లైసెన్స్ లేని మైనర్లతో ట్రాక్టర్లు డ్రైవింగ్ కు వినియోగించడం ఈమధ్య మరింతగా పెరిగింది.
పర్యావరణానికి ముప్పు
అక్రమ ఇసుక తవ్వకాల వల్ల వాగుల సహజ నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాగు ల లోతు పెరగడం వల్ల భూగర్భ జలాలపై ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే అనేక వాగుల్లో ఇసుకను తోడేయడంతో రాళ్లు తేలి సహజత్వాన్ని కోల్పోతున్నాయి.
అధికారుల చర్యలు అవసరం
ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు అప్పుడప్పుడు దాడులు నిర్వహించి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నప్పటికీ ఇసుక అక్ర మ రవాణాకు పూర్తిస్థాయిలో కట్టడి చేయలేకపోతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. వాగుల వద్ద పర్యవేక్షణ పెంచి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇసుక అక్రమ రవాణాకు చర్యలు తీసుకుంటున్నాం
నెల్లికుదురు మండల సరిహద్దులో ప్రవహి స్తున్న ఆకేరు వా గు నుండి ఇసుక అక్రమ రవాణా జరగకుండా చ ర్యలు తీసుకుంటున్నాం. వాగుల వెంట ఇసుక రవాణా కోసం ఏర్పాటు చేసుకు న్నా ప్రత్యామ్నాయ రహదారులపై ట్రా క్టర్లు నడవకుండా వాగుల వెంట జేసీబీ యంత్రంతో కందకాలు కూడా తీయిం చాం. రాత్రిపూట వాటిని కొందరు పూడ్చివేసి ఇసుక రవాణా చేస్తున్నట్లు తెలుసుకొని అక్రమంగా తరలిస్తున్న ఇ సుక ట్రాక్టర్లను పట్టుకుని కేసులు నమో దు చేస్తున్నాం. ఇకముందు కూడా అక్ర మ ఇసుక రవాణా జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం.
చిర్రా రమేష్ బాబు, ఎస్ ఐ, నెల్లికుదురు




