26 May, 2026 | 2:28 AM

నాటు సారా స్థావరాలపై పోలీసుల దాడులు

26-05-2026 01:31 AM

మహబూబాబాద్, మే 25 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లక్ష్మీపురం, నెల్లికుదురు మండలం కాస్య తండా శివారు ధర్మా తండాలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ఆదేశాల మేరకు పోలీసులు నాటు సారా స్థావరాలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీపురంలో నంబర్ ప్లేట్లు లేని 15 ద్విచక్ర వాహనాలు, అక్రమంగా నిలువ ఉంచిన 80 కిలోల నల్ల బెల్లం, 25 లీటర్ల గుడుంబా, 20 కిలోల పటిక, ఎనిమిది బీరు సీసాలు, ఒక ఫుల్ బాటిల్ లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు.

అలాగే 380 లీటర్ల నాటు సారా తయారీకి నిలువ చేసిన బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. బాధ్యులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక ధర్మ తండాలో నిర్వహించిన పోలీసుల తనిఖీల్లో 50 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అలాగే వెయ్యి లీటర్ల నాటు సారాకు వినియోగించడానికి సిద్ధం చేసిన బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.