01-11-2025 08:33:09 PM
సూర్యాపేట,(విజయక్రాంతి): పోలీస్ కుటుంబాలకు భరోసా పోలీస్ భద్రత స్కీమ్ అని జిల్లా ఎస్పీ కె. నరసింహ అన్నారు. జిల్లాలోని కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రాంబాబు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆయన కుటుంబానికి పోలీసు భద్రత స్కీం నుండి నగదు మంజూరి కాగా శనివారం చెక్కును జిల్లా పోలీస్ కార్యాలయం నందు అతని కుటుంబ సభ్యులకు అందజేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలీసు శాఖలో పని చేస్తూ ఆకాలంగా ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కుటుంబాలను పోలీసు శాఖ అన్ని విధాలుగా అదుకుంటుందన్నారు. దివంగత సిబ్బంది కుటుంబాలకు పోలీసు భద్రత స్కీమ్ బాసటగా నిలుస్తుందన్నారు. ఈ నగదును సద్వినియోగం చేసుకోవాలన్నారు.